గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 25, 2020 , 11:39:22

కాళేశ్వరంతో ప్రాజెక్ట్ తో కోనసీమను తలపిస్తున్న తెలంగాణ పల్లెలు

కాళేశ్వరంతో ప్రాజెక్ట్ తో కోనసీమను తలపిస్తున్న తెలంగాణ పల్లెలు

సిద్దిపేట : కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, సమృద్ధిగా కురిసిన వర్షాలతో తెలంగాణ పల్లెలు కోనసీమను తలపిస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. కొండ పోచమ్మ సాగర్ లో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడం, చేపలు విడుదల చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం అన్నారు.

 ఈ యేడు కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ లో 7.5 టీఎంసీ ల నీటిని నింపుతామని పేర్కొన్నారు. కొండ పోచమ్మసాగర్ రిజర్వాయర్ లో 14 లక్షల చేప పిల్లలను విడుదల చేస్తామన్నారు.  ప్రతి చెరువు, చెక్ డ్యాం, రిజర్వాయర్ లలో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రాబోయే రోజుల్లో రొయ్యలను కూడా జలాశయాల్లో పెంచుతామన్నారు.logo