శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Sep 27, 2020 , 19:15:00

ఢిల్లీలో ప్రతిష్టాత్మక మూడు యూనివర్సిటీలకు తెలంగాణ వీసీలు

ఢిల్లీలో ప్రతిష్టాత్మక మూడు యూనివర్సిటీలకు తెలంగాణ వీసీలు

హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలోని మూడు ప్రతిష్టాత్మక యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారేనని, ఇది శుభపరిణామం, అభినందనీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన శ్రీకృష్ణ దేవరావు రెండు రోజుల క్రితం నియమితులైనట్లు ఆయన తెలిపారు.

ఇప్పటికే జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన జగదీష్ కుమార్, ఢిల్లీ ఐఐటీ వైస్ ఛాన్సలర్ గా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాంగోపాల్ రావు గత రెండేండ్ల క్రితం నుంచి విధులు నిర్వహిస్తున్నారని వినోద్ కుమార్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి అవకాశాల పరంపర తెలంగాణ ప్రాంతం నుంచి మరింతగా కొనసాగుతుందని వినోద్ కుమార్ ఆకాక్షించారు.