శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Aug 29, 2020 , 21:24:47

సెప్టెంబ‌ర్ 1 నుండి తెలంగాణ వ‌ర్సిటీ విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం

సెప్టెంబ‌ర్ 1 నుండి తెలంగాణ వ‌ర్సిటీ విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం

నిజామాబాద్ : త‌ఎలంగ తెలంగాణ విశ్వ‌విద్యాల‌యం 2020-21 విద్యా సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ 1వ తేదీ నుండి ప్రారంభం అవుతుంద‌ని వ‌ర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెస‌ర్ న‌సీమ్ శ‌నివారం తెలిపారు. ఈ మేర‌కు వివిధ ర‌కాల కోర్సులకు సంబంధించి టీచింగ్ స్టాఫ్ సిల‌బ‌స్‌ను ప్రిపేర్ చేయాల‌ని పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్, పోస్ట్-గ్రాడ్యుయేషన్ కోర్సులకు సంబంధించి టీయూ వ‌ర్సిటీ క‌ళాశాల‌లు, అనుబంధ‌, ఎయిడెడ్‌, ప్రైవేట్ కాలేజీలు 3, 5, 7, 8వ సెమిస్ట‌ర్ల‌కు సిద్ధంగా ఉండాల‌న్నారు. ఈ సెమిస్టర్లలో త‌ప్ప‌నిసరిగా ఆన్‌లైన్ విధానం ద్వారా తరగతులు నిర్వహించాలని రిజిస్ట్రార్ తెలిపారు. ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించడానికి అవసరమైన సాంకేతిక వ్యవస్థను సిద్ధం చేసుకోవాల‌ని కళాశాల ప్రిన్సిపాల్స్‌ను కోరారు. ఆన్‌లైన్ తరగతులను బోధించడానికి అవసరమైన సిలబస్‌తో సిబ్బంది సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.


logo