శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Aug 31, 2020 , 01:57:02

కరోనా టెస్టుల్లో తెలంగాణ టాప్‌

కరోనా టెస్టుల్లో తెలంగాణ టాప్‌

  • పది లక్షల మందిలో రోజూ 1,671 టెస్టులు
  • 1,253 టెస్టులతో రెండోస్థానంలో అసోం
  • డబ్ల్యూహెచ్‌వో  మార్గదర్శకాలు
  • 10 లక్షల జనాభాకు 140 టెస్టులు
  • పాజిటివ్‌ రేటు 5% ఉంటేనే టెస్టులు పెంచాలి
  • రాష్ట్రంలో పాజిటివ్‌ రేటు 4.45%
  • దేశ సగటు 7.46%

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌-19 కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తున్నది. ఒకవైపు కరోనా వ్యాప్తిని కట్టడి చేస్తూనే మరోవైపు వైరస్‌ సోకిన ప్రతి ఒక్కరినీ గుర్తించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్రతి పదిలక్షల మందిలో ప్రతిరోజూ 140 మందికి టెస్టులు చేయాల్సి ఉండగా.. తెలంగాణలో 1,671మందికి టెస్టులు చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ దేశంలోనే.. అగ్రస్థానంలో ఉన్నది. 1,253 టెస్టులు చేస్తూ అసోం రెండోస్థానంలో, 1,235తో కేరళ మూడోస్థానంలో ఉన్నాయి. తెలంగాణలో 3.72 కోట్ల జనాభా ఉండగా.. డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల ప్రకారం ప్రతిరోజూ 5,600 టెస్టులు చేయాలి. అయితే, ప్రభుత్వం చేసిన పకడ్బందీ ఏర్పాట్లతో సగటున 61 వేల టెస్టులు జరుగుతున్నాయి. డబ్ల్యూహెచ్‌వో లక్ష్యంతో పోల్చితే దాదాపు 11 రెట్లు అధికం. పాజిటివ్‌ వచ్చిన వారు 5 శాతం కంటే ఎక్కువగా ఉంటే ఆ మేరకు టెస్టులు పెంచాలని సూచించింది. తెలంగాణలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 4.78 శాతంగా ఉండగా, దేశవ్యాప్తంగా 7.46 శాతంగా నమోదవుతున్నది.


logo