గురువారం 04 జూన్ 2020
Telangana - May 18, 2020 , 00:19:36

మారుతున్న తెలంగాణ దశ

మారుతున్న తెలంగాణ దశ

  • సీఎం కేసీఆర్‌ నిర్ణయాలతో దేశానికి దిశ
  • మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్‌ నిర్ణయాలతో చేపట్టిన పలు పథకాల ద్వారా తెలంగాణ దశ మారుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. తాము అమలుచేస్తున్న విధానాలను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్‌ ఇస్తున్నామని, రైతులు విత్తనాల కోసం తండ్లాడే పరిస్థితులు ఇప్పుడులేవని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో వరిధాన్యం మాత్రమే కొన్నారని, ఇప్పుడు అన్ని రకాల పంటలను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలుచేస్తున్నదని చెప్పారు. దళారులు, వ్యాపారుల మీద ఆధారపడకుండా రైతును కాపాడుతున్నామని తెలిపారు. ఆరేళ్లలో వ్యవసాయం దండగ అనే మాట నుంచి పండుగ అనే స్థితికి తీసుకొచ్చామని మంత్రి అన్నారు.


logo