మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 13:11:02

ఐటీ వృద్ధిలో రాష్ట్ర స‌గటే ఎక్కువ‌‌: మ‌ంత్రి కేటీఆర్‌

ఐటీ వృద్ధిలో రాష్ట్ర స‌గటే ఎక్కువ‌‌: మ‌ంత్రి కేటీఆర్‌

హైద‌రాబాద్‌: ఐటీ వృద్ధిలో జాతీయ స‌గ‌టు కంటే రాష్ట్ర స‌గ‌టు ఎక్కువ‌గా ఉన్న‌ద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. హైద‌రాబాద్‌లో ఐటీ పురోగ‌తి బాగుంద‌ని చెప్పారు. ఉప్ప‌ల్ జ‌రిగిన హైద‌రాబాద్ గ్రిడ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్య‌క్ర‌మంలో మంత్రి పాల్గొన్నారు. న‌గ‌రంలో న‌లువైపులా స‌మాన అభివృద్ధి జ‌ర‌గాల‌న్న‌దే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు. 

న‌గ‌రం తూర్పువైపున ఉన్న ఉప్ప‌ల్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్న‌ద‌న్నారు. నగ‌రం లోప‌ల ఉన్న ప‌రిశ్ర‌మ‌ల‌ను న‌గ‌రం వెలుప‌ల‌కు త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని చెప్పారు. ఎంఎంటీఎస్ ను రాయ‌గిరి వ‌ర‌కు పొడిగించేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నామ‌ని తెలిపారు. రాచ‌కొండ‌కు కూడా సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటుకు సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ చొర‌వ చూపార‌ని వెల్ల‌డించారు. 


logo