శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 02, 2020 , 22:11:11

తెలంగాణలో కొత్తగా 1213 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1213 కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్నది. గురువారం కొత్తగా 1213 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.8 మంది మృతి చెందారు. 987 మంది చికిత్సకు కోలుకొని దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే 998 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు  18570 కేసులు నమోదుకాగా ఇందులో 9,226 యాక్టివ్‌ కేసులుండగా 9,069 మంది దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. 275మంది మృతి చెందారు. 

రంగారెడ్డి జిల్లాలో 48, మేడ్చల్ జిల్లాలో 54 కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో 18, వరంగల్‌ గ్రామీణ జిల్లాలో 10, అర్బన్‌ జిల్లాలో 9, నల్లగొండ జిల్లాలో 8, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, భద్రాది కొత్తగూడెం జిల్లాలో 7చొప్పున,  రాజన్నసిరిసిల్ల జిల్లాలో 6, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలో 5 చొప్పున,  సూర్యాపేట, ములుగు, నిర్మల్‌ జిల్లాలో 4చొప్పున,  నారాయణ్‌పేట్‌, కామారెడ్డి జిల్లాలో 2చొప్పున, వికరాబాద్‌, నాగర్‌కర్నూల్‌, యాదాద్రి, మెదక్‌, సిద్దిపేట, గద్వాల జిల్లాలో ఒక్కోటి చొప్పున నమోదయ్యాయి. logo