శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 22:42:14

తెలంగాణలో 1676 కరోనా కేసులు

తెలంగాణలో 1676 కరోనా కేసులు


హైదరాబాద్‌ : రాష్ట్రంలో గురువారం 1676 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 788 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 41,018 కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, వైరస్‌ ప్రభావంతో ఇవాళ 10 మంది మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 396కు చేరింది. ఇవాళ 1296 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 27,295 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 13,328 మంది మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ 14027 మందికి కొవిడ్‌-19 పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 2,22,693 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది.


logo