సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 22:20:18

తెలంగాణలో 1,278 కరోనా కేసులు

తెలంగాణలో 1,278 కరోనా కేసులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో శుక్రవారం 1,278 కరోనా పాజిటివ్‌కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ ‌కార్పొరేషన్‌ పరిధిలోనే 762 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 32,224 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, వైరస్‌ప్రభావంతో ఇవాళ ఎనిమిది మందిమృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 339కి చేరింది. ఇవాళ 1,013మంది వైరస్‌నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 19,205 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 12,680 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.
logo