శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 22:19:47

తెలంగాణలో కొత్తగా 1879 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1879 కరోనా కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణలో మంగళవారం 1879 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ  తెలిపింది. ఇందులో కేవలం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 1,422 నమోదయ్యాయి. వైరస్‌ బారినపడి వారిలో ఇవ్వాళ ఏడుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 27,612 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణకాగా 11,012 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారు. 16,287 మంది చికిత్సకు కోలుకొని దవాఖానల నుంచి డిశ్చార్జికాగా ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్‌ బారినపడి 313 మంది మృతి చెందారు.  మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 6,220 శ్యాంపిళ్లను పరీక్షించగా 1879మందికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,28,438 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. 

ఇవ్వాళ గ్రేటర్‌ హైదరాబాద్‌లో 1,422, రంగారెడ్డి జిల్లాలో 176, మెడ్చల్‌ జిల్లాలో 94, కరీంనగర్‌ జిల్లాలో 32, నల్లగొండ జిల్లాలో 31, నిజామాబాద్‌ జిల్లాలో 19, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 13, మెదక్‌, ములుగు జిల్లాల్లో 12 కేసుల చొప్పున,  సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 9 చొప్పున, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 11, కామారెడ్డి జిల్లాలో 7, గద్వాల జిల్లాలో 4, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 3 కేసుల చొప్పున, జగితాల్య, మహబూబాబాద్‌, రాజన్నసిరిసిల్ల, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 2కేసుల చొప్పున, వనపర్తి, సిద్దిపేట, ఆదిలాబాద్ జనగామ, వికారాబాద్‌ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. 


logo