సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 29, 2020 , 20:50:40

తెలంగాణలో కొత్తగా 975 కరోనా కేసులు..

తెలంగాణలో కొత్తగా 975 కరోనా కేసులు..

హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా విజృంభిస్తూనే ఉన్నది. తాజాగా సోమవారం 975 కేసులు నమోదయ్యాయి. కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలో 861 కేసులు నమోదయ్యాయి. 410మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి కాగా ఆరుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 15,394 కేసులు నమోదుకాగా ఇందులో 9,559 యాక్టివ్‌ కేసులున్నాయి. 5,582మంది కోలుకోగా 253మంది మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలో 40 కేసులు, సంగారెడ్డి జిల్లాలో14, కరీంనగర్‌ జిల్లాలో 10, మేడ్చల్‌ జిల్లాలో 20, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 05, అర్బన్‌ జిల్లాలో 04, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 08,  మహబూబ్‌నగర్‌ జిల్లాలో 3, నల్గొండ, కామారెడ్డి, యాదాద్రి భువనరిగి  జిల్లాలో రెండేసి చొప్పున,  సిద్ధిపేట, ఆసిఫాబాద్‌, గద్వాల్‌, మహబూబాబాద్‌లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు హెల్త్‌ బులిటెన్లో  వెల్లడించింది.


logo