శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 01:52:43

బియ్యం త్వరగా అందించండి

బియ్యం త్వరగా అందించండి

  • రైస్‌మిల్లర్లకు మంత్రి గంగుల ఆదేశం 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా నేపథ్యంలో రేషన్‌కార్డుదారులకు రెట్టింపు బియ్యం సరఫరాచేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున.. ఇందుకు అవసరమైన బియ్యాన్ని త్వరగా అందించాలని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ రైస్‌మిల్లర్లను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లో బియ్యం పంపిణీపై ఆయన సమీక్షించారు.గత వానకాలానికి సంబంధించి రైస్‌మిల్లర్ల నుంచి 31.61 లక్షల టన్నుల రా బియ్యం సేకరించాల్సి ఉండగా.. 27.99 లక్షల టన్నులు సేకరించామని, ఇంకా 3.62 లక్షల టన్నులు రావాల్సి ఉందని మంత్రి చెప్పారు. యాసంగిలో 43.63 లక్షల టన్నుల బాయిల్డ్‌ బియ్యానికి 9.04 లక్షల టన్నులు మాత్రమే అందాయని, ఇంకా 34.59 లక్షల టన్నులు రావాల్సి ఉన్నదని చెప్పారు. స్పందించిన రైస్‌మిల్లర్లు.. గడువులోగా బియ్యం సరఫరా చేస్తామని చెప్పారు. 


logo