గురువారం 02 జూలై 2020
Telangana - Jun 01, 2020 , 07:44:38

నేటి నుంచి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం

నేటి నుంచి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం

హైదరాబాద్‌: వానాకాలంలో సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు తెలంగాణ  ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం సోమవారం ప్రారంభంకానుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం ఈనెల 8 వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా దోమల నివారణ చర్యలు తీసుకోవడంతో పాటు మురుగు కాల్వల్లో పూడికతీత, నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వాటిని శుభ్రం చేయడం, పిచ్చి మొక్కలను తొలగించడం,  ఫాగింగ్‌ వంటివి చేపడతారు. 


logo