e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home తెలంగాణ పండుగలా రేషన్‌కార్డుల పంపిణీ

పండుగలా రేషన్‌కార్డుల పంపిణీ

  • ఒక్కరోజే 3.09 లక్షల కార్డులు అందజేత
  • వచ్చే నెల నుంచి కార్డుదారులకు రేషన్‌
  • సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు

హైదరాబాద్‌, జూలై 26(నమస్తే తెలంగాణ)/నెట్‌వర్క్‌: రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీ పండుగ వాతావరణాన్ని తలపించింది. ఆయా జిల్లాలు, మండలాల్లో సోమవారం ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో మం త్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు కొత్త కార్డులను పంపిణీచేశారు. ఒక్కరోజే అర్హులైన 3,09,083 మందికి కొత్త కార్డులు పంపిణీ చేయడం విశేషం. దేశంలో మరే రాష్ట్రంలో ఇంత భారీ మొత్తంలో కార్డులు జారీచేసిన దాఖలు లేవు. అన్నార్తుల పక్షాన నిలిచే తెలంగాణ ప్రభుత్వం రికార్డుస్థాయిలో కార్డులు జారీ చేసింది. ఈ సందర్భంగా కార్డులుపొందిన లబ్ధిదారులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అర్హులైన వారిలో ఎవరైనా కార్డు ను తీసుకోని పక్షంలో మీసేవా కేంద్రాల్లో తీసుకోవచ్చని అధికారులు సూచించారు. కాగా, కొత్తకార్డు పొందిన వారికి ఆగస్టు నుంచి రేషన్‌ సరఫరా చేయనున్నట్టు తెలిపారు.
సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేశారు. రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలందరికీ తెల్లరేషన్‌కార్డులు ఇస్తామని చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బీర్కూర్‌ మండలాల్లో స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, వనపర్తిలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రేషన్‌ కార్డులను పంపిణీచేశారు. నిర్మల్‌లో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కొత్త రేషన్‌ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు.

3.09 లక్షల రేషన్‌ కార్డుల జారీతో చరిత్ర: మంత్రి గంగుల

రాష్ట్రంలో ఒకేరోజు 3,09,082 లబ్ధిదారులకు కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయడం ఒక చరిత్ర అని, దేశంలో ఎక్కడా ఇంత భారీ సంఖ్యలో కార్డులివ్వలేదని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి కొత్త కార్డుల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 4 కోట్ల మంది ప్రజలకు కేంద్రం కేవలం 53 లక్షల కార్డులను మాత్రమే జారీ చేసి చేతులు దులుపుకుంటే.. సీఎం కేసీఆర్‌ మరో 32 లక్షల రేషన్‌ కార్డులను పంపిణీ చేశారని తెలిపారు. కొత్త వాటితో కలుపుకొని ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్‌కార్డుల సంఖ్య 91 లక్షలకు చేరిందన్నారు.

స్వచ్ఛందంగా కార్డులు వెనక్కి..

- Advertisement -

స్థోమత ఉన్నవారు రేషన్‌ కార్డులను వదులుకోవాలన్న జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పిలుపునకు స్పందించి ఆరుగురు తమ కార్డులను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. సోమవారం మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌లో ఎమ్మెల్యే కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే పిలుపునివ్వగా.. వెంటనే స్పందించిన ఆరుగురు లబ్ధిదారులు తమ కార్డులను సరెండర్‌ చేశారు.

పైసా ఖర్చు లేకుండా..

పైసా ఖర్చు లేకుండా కొత్త రేషన్‌ కార్డొచ్చింది. గతంలో చెప్పులరిగేలా తిరిగినా, డబ్బు లు ఖర్చుపెట్టినా కార్డులు రాలేదని తెలిసిన వాళ్లు చెప్పిండ్రు. పెండ్లి అయి వేరుపడినంక మాకు సొంతంగా కార్డు కావాలని ఆన్‌లైన్‌లో ఐప్లె చేసుకున్నా. నిజమైన పేదోళ్లకే
ప్రభుత్వం కార్డులిస్తున్నది.
-నజ్మా, విజయకాలనీ, సూర్యాపేట పట్టణం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana