ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 16:34:15

త్వరలో రోజుకు 25 వేల కరోనా పరీక్షలు

త్వరలో రోజుకు 25 వేల కరోనా పరీక్షలు

హైదరాబాద్: రాబోయే రోజుల్లో తెలంగాణలో కొవిడ్-19 పరీక్ష సామర్థ్యాన్ని రోజుకు కనీసం 25 వేల శాంపిల్స్‌కు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రైవేట్ ల్యాబ్‌లు, ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాల వద్ద వేగవంతమైన పరీక్షలు, ప్రభుత్వ ప్రయోగశాలల్లో పీసీఆర్ పరీక్షలు రోజుకు 15,000 పరీక్షలు చేస్తున్నారు.

 "రాబోయే వారాల్లో స్వాబ్‌ నమూనాలను 20,000 కు, తరువాత రోజుకు 25,000 కు పెంచుతారు. అర్హత లేని లేదా లక్షణాలు లేని వారు అనవసరంగా పరీక్ష కోసం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శిస్తున్నారని గమనించాం. ఇది అర్హులైన రోగులను ఇబ్బందికి గురిచేస్తుంది. కరోనా వైరస్‌ లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులు మాత్రమే ప్రభుత్వం నడుపుతున్న ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను సందర్శించి పరీక్షించుకోవాలని కోరుతున్నాం” అని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ జీ శ్రీనివాస్ రావు చెప్పారు.


logo