గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 22:02:54

తెలంగాణలో 1430 కరోనా కేసులు

తెలంగాణలో 1430 కరోనా కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మంగళవారం రాష్ట్రంలో 1430 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 703 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 47,705 కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, వైరస్‌ ప్రభావంతో ఇవాళ ఏడుగురు మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 429కి చేరింది. ఇవాళ 2062 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 36,385 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 10,891మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం 16,855మందికి కొవిడ్‌-19 పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 2,76,222 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది.


logo