ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Aug 29, 2020 , 15:59:27

రూ.34 కోట్ల‌ జ‌ర్న‌లిస్టుల నిధి ఉన్న‌ ఏకైక రాష్ట్రం తెలంగాణ‌

రూ.34 కోట్ల‌ జ‌ర్న‌లిస్టుల నిధి ఉన్న‌ ఏకైక రాష్ట్రం తెలంగాణ‌

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో ఆరు వంద‌ల‌పైచిలుకు జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా వ‌చ్చింద‌ని, ప్ర‌తి ఒక్క‌రికి రూ.20 వేల చొప్పున ఆర్థిక స‌హాయం అందించామ‌ని మీడియా అకాడ‌మీ చైర్మ‌న్ అల్లం నారాయ‌ణ అన్నారు. రూ.34 కోట్ల జ‌ర్న‌లిస్టుల నిధి ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్ల‌డించారు. ఆయ‌న ఈరోజు టీన్యూస్ కెమెరా హెచ్ఓడీ, టీవీజీఏ అధ్య‌క్షుడు పోలంకి ప్ర‌కాశ్ మృతికి సంతాపంగా ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్‌లో నిర్వ‌హించిన స‌భలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు రూ.3 వేల పెన్ష‌న్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మ‌న‌దేన‌ని చెప్పారు. 

రాష్ట్ర సాధాన ఉద్య‌మంలో తెలంగాణ జ‌ర్న‌లిస్టుల ఫోరం కీల‌క‌పాత్ర పోషించింద‌న్నారు. ఉద్య‌మంలో టీ న్యూస్ చాన‌ల్‌ది ప్ర‌ధాన‌పాత్ర అని, అందులో ప్ర‌కాశ్ ఉన్నార‌ని చెప్పారు. వీడియో జ‌ర్న‌లిస్ట్ సంఘం స్థాప‌న‌కు ప‌నిచేసిన‌వారిలో ప్ర‌కాశ్ కూడా ఉన్నార‌ని తెలిపారు. ఆయ‌న కుటుంబానికి మీడియా అకాడ‌మీ అండ‌గా ఉంటుంద‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మ‌ల్యే క్రాంతికిర‌ణ్‌, టీన్యూస్ ఇన్‌పుట్ ఎడిట‌ర్ పీవీ శ్రీనివాస్‌, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ సూర‌జ్ భ‌ర‌ద్వాజ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 


logo