e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home టాప్ స్టోరీస్ పార్టీ మారనున్న టీటీడీపీ రమణ

పార్టీ మారనున్న టీటీడీపీ రమణ

పార్టీ మారనున్న టీటీడీపీ రమణ
  • సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం

హైదరాబాద్‌, జూన్‌ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో టీడీపీ ఖాళీ కానున్నదా? తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్‌ రమణ పార్టీ మారబోతున్నారా? ఆయనకు ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయా? దీనిపై సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతున్నది. ఆయన త్వరలోనే వేరే పార్టీలోకి వెళ్లే అవకాశాలున్నాయని వస్తున్న వదంతులను రమణ ధ్రువీకరించారు. తనకు బీజేపీ, టీఆర్‌ఎస్‌ల నుంచి ఆఫర్లు ఉన్నాయని తెలిపారు. ఈ రెండు పార్టీల్లో చేరాల్సిందిగా ఆయా పార్టీల నాయకులు కోరుతున్నారని, అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు తనను కలిసి రాజకీయ భవిష్యత్‌ గురించి అడిగారన్నారు. టీఆర్‌ఎస్‌కు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఫోన్‌చేశారని తెలిపారు. ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని, తన సన్నిహితులు, అనుచరులతో చర్చించి తుది నిర్ణయం తీసుకొంటానని ఆయన తెలిపారు. రమణ పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారం టీటీడీపీలో చర్చనీయాంశంగా మారింది. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన రమణకు బీసీ నేతగా, సౌమ్యుడిగా మంచి గుర్తింపు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసిన రమణ, రాష్ట్ర విభజన తర్వాత నుంచి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పార్టీ మారనున్న టీటీడీపీ రమణ

ట్రెండింగ్‌

Advertisement