శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 03:52:01

పంచాయతీలపై మరింత బాధ్యత

పంచాయతీలపై మరింత బాధ్యత

  • కొత్త రెవెన్యూ చట్టంపై గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి కొత్తగా తెచ్చిన చట్టంతో పంచాయతీలపై బాధ్యత మరింత పెరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ఈ బాధ్యతను సర్పంచులు, కార్యదర్శులు నిబద్ధతతో నిర్వహించాలని బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. కొత్త రెవెన్యూ చట్టం వల్ల అవినీతి, అలసత్వంతోపాటు భూ సమస్యలు తగ్గిపోతాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ గొప్ప సంస్కరణ వాది అని, ఆయన చేపట్టిన పలు సంస్కరణల్లో రెవెన్యూ చట్టం చరిత్రాత్మకమని కొనియాడారు. భూ రికార్డులను సరిదిద్దే చట్టంతో ఆయన మరోసారి రైతు బాంధవుడు అనిపించుకున్నారని, ఈ చట్టం నిరుపేదలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగునంగా నిజాయితీగా పని చేయడానికి తామంతా సిద్ధమని తెలిపారు


logo