శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 22:20:44

తెలంగాణలో 1524 కరోనా కేసులు

తెలంగాణలో 1524 కరోనా కేసులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో మంగళవారం 1524 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 815 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 37,745 కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, వైరస్‌ ప్రభావంతో ఇవాళ 10 మంది మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 375కు చేరింది. ఇవాళ 1161 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 24,840 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 12,531 మంది మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం 13,175 మందికి కొవిడ్‌-19 పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 1,95,024 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది. 
logo