శనివారం 06 జూన్ 2020
Telangana - May 15, 2020 , 07:13:01

నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు

నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు

హైదరాబాద్ : బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం... తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది శుక్రవారం దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో వాయుగుండంగా మారి.. 16వ తేదీ సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.17వ తేదీ వరకు వాయవ్యదిశగా ప్రయాణించి, 18, 19 తేదీల్లో ఈశాన్యదిశగా ఉత్తర బంగాళాఖాతం వైపు వెళ్లొచ్చని పేర్కొన్నది. 

దీని ప్రభావంతో శుక్ర, శనివారాలు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోకూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. వడగాడ్పులు కూడా వీయొచ్చని పేర్కొన్నది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా మధ్య ట్రోపోస్పియర్‌ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతున్నదని వెల్లడించింది. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు నమోదవుతాయని పేర్కొన్నది. 


logo