గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 07:39:35

కాలుష్య తీవ్రతను తెలిపే ‘టీఎస్‌ ఎయిర్‌' యాప్

కాలుష్య తీవ్రతను తెలిపే ‘టీఎస్‌ ఎయిర్‌' యాప్

హైదరాబాద్ : హైదరాబాద్‌లో కాలుష్య తీవ్రతను ప్రజలు సులభంగా తెలుసుకునేలా ప్రభుత్వం ‘టీఎస్‌ ఎయిర్‌' యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నది. త్వరలోనే ఈ యాప్‌ను కాలుష్య నియంత్రణ బోర్డు (పీసీబీ) ప్రారంభించనున్నది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆరు చోట్ల ఉన్న వాయుకాలుష్య తీవ్రత నమోదు కేంద్రాలతో పాటు మరో 7 కేంద్రాలను, ఒక మొబైల్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు పీసీబీ కార్యాచరణ రూపొందిస్తున్నది. ఆన్‌లైన్‌ ద్వారానే గాలి నాణ్యతను గుర్తించేందుకు నిరంతర ఎయిర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి, టీఎస్‌ ఎయిర్‌ మొబైల్‌ యాప్‌కు అనుసంధానం చేయనున్నారు.


logo