మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 20:37:29

తెలంగాణ రౌండ‌ప్‌..

తెలంగాణ రౌండ‌ప్‌..

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా గురువారం చోటుచేసుకున్న ప‌లు వార్తా విశేషాల స‌మాహారం. 


రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ భార‌త‌దేశానికి ట్రెండ్ సెట్ట‌ర్ అని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభించిన అనంత‌రం సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు. ప్ర‌జ‌ల బ‌తుకంతా భూమి చుట్టూ ఉండేది. ఒక‌ప్పుడు భూమికి ప్రాధాన్య‌త ఉండేది కాదు. మ‌రింత స‌మాచారం కొర‌కు.. 


ఎల‌క్ర్టిక్ వాహ‌నాల‌ను ప్రోత్స‌హించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ముంద‌డుగు వేసింది. ఈ క్ర‌మంలో ఎల‌క్ర్టిక్ వాహ‌నాల పాల‌సీని రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 2020-2030 కాలానికి ఎల‌క్ర్టిక్ వాహ‌నాల‌కు విధాన ప్ర‌క‌ట‌న జారీ చేసింది. మ‌రింత స‌మాచారం కొర‌కు.. 


వ‌రి ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్ల‌ర్లు స‌హ‌క‌రించాల‌ని పౌర‌స‌ర‌ఫ‌రాలశాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు. పౌర‌స‌ర‌ఫ‌రాల క‌మిష‌న్ కార్యాల‌యంలో రైస్ మిల్ల‌ర్ల అసోసియేష‌న్ ప్ర‌తినిధుల‌తో మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌, పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ చైర్మ‌న్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. మ‌రింత స‌మాచారం కొర‌కు.. 


రాష్ర్టంలో సాదా బైనామాల గ‌డువు మ‌రో వారం పొడిగిస్తున్న‌ట్లు సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. సాదాబైనామాల ద్వారా క్ర‌య‌, విక్ర‌యాలు జ‌రిపిన వాళ్లు చివ‌రి అవ‌కాశం వినియోగించుకోవాలి. భ‌విష్య‌త్‌లో సాదా బైనామాల‌కు అవ‌కాశం ఉండ‌ద‌ని తేల్చిచెప్పారు. మ‌రింత స‌మాచారం కొర‌కు.. 


తెలంగాణ స్టేట్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఎంసెట్‌) 2020 అర్హత ప్రమాణాలను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. మ‌రింత స‌మాచారం కొర‌కు.. 


నిజా‌మా‌బాద్‌ స్థానిక సంస్థల ఎమ్మె‌ల్సీగా కల్వ‌కుంట్ల కవిత ప్రమాణం స్వీకారం చేశారు. శాస‌న‌స‌మం‌డలి దర్బార్ హాల్‌లో మధ్యాహ్నం 12.45 గంట‌లకు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేం‌ద‌ర్‌‌రెడ్డి ఆమె చేత ప్రమాణం చేయించారు. మ‌రింత స‌మాచారం కొర‌కు.. 


న‌గ‌రంలోని హుస్సేన్ సాగ‌ర్ నుంచి మూసీ వ‌ర‌కు ఉన్న నాలా ప‌టిష్ట‌త‌, అభివృద్ధికి రూ. 68.40 కోట్ల నిధుల‌తో ప‌నులు చేప‌డుతున్న‌ట్లు జీహెచ్ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ తెలిపారు. మ‌రింత స‌మాచారం కొర‌కు.. 


తెలంగాణ‌లో నైజాం పాలన నుంచి స‌మైక్యాంధ్ర పాల‌న వ‌ర‌కు భూమి శిస్తు వ‌సూలు చేశారు. కానీ కేసీఆర్ మాత్రం భూమి ఉన్న ప్ర‌తి రైతుకు రైతుబంధు ప‌థ‌కం ద్వారా డ‌బ్బులిచ్చి చ‌రిత్ర తిర‌గ‌రాశార‌ని ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు అన్నారు. మ‌రింత స‌మాచారం కొర‌కు.. 


మ‌న గురుకులాల ప‌నితీరు ప్ర‌శంస‌నీయ‌మ‌ని రాష్ర్ట మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ ప్ర‌శంసించారు. అన్ని వర్గాల వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ మరిన్ని గురుకుల విద్యాల‌యాల‌ను నెల‌కొల్పార‌న్నారు. గురుకులాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. మ‌రింత స‌మాచారం కొర‌కు.. 


దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భారతి హోలికేరీ పిలుపు నిచ్చారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును హక్కుగా మాత్రమే చూడకుండా బాధ్యతగా భావించాలన్నారు. మ‌రింత స‌మాచారం కొర‌కు..