గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 20:11:07

తెలంగాణ రౌండ‌ప్‌...

తెలంగాణ రౌండ‌ప్‌...

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా గురువారం చోటుచేసుకున్న ప‌లు వార్తావిశేషాల స‌మాహారం.


వ‌ర్షాల వ‌ల్ల సంభ‌వించిన న‌ష్టాన్ని ప‌రిశీలించేందుకు రాష్ర్టానికి విచ్చేసిన కేంద్ర బృందం సిద్దిపేట జిల్లాలోని ములుగు, మర్కుక్ మండలాల్లో క్షేత్రస్థాయిలో ప‌ర్య‌టించింది. జిల్లాలో 84,159 ఎకరాల్లో రూ. 423 కోట్ల 70 లక్షల మేర పంట నష్టం వాటిన‌ట్లు క‌లెక్ట‌ర్ ఈ సంద‌ర్భంగా కేంద్ర బృంద స‌భ్యుల‌కు వెల్ల‌డించారు. మ‌రింత స‌మాచారం కొర‌కు..


కేవలం ఐదు నెలల కాలానికి 91.70 లక్షల రూపాయలకు వేలం పాడి ఓ వ్యక్తి సంతను (అంగడి) దక్కించుకున్న ఘటన ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలంలోని పండితాపురంలో చోటు చేసుకుంది.  మ‌రింత స‌మాచారం కొర‌కు..


దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి అనునిత్యం పాటుపడిన సోలిపేట రామలింగారెడ్డి ఆశయాలను కొనసాగిస్తానని దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత అన్నారు. గురువారం చేగుంట మండలం వల్లభపూర్, తాండ, నర్సంపల్లి, చిట్టోజిపల్లి, పొలంపల్లి, పోతన్ శెట్టి పల్లి గ్రామాల్లో మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి, మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డితో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. మ‌రింత స‌మాచారం కొర‌కు..


తెలంగాణ మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు నాయిని న‌ర్సింహారెడ్డి అంత్య‌క్రియ‌ల‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పార్టీ నాయ‌కులు హాజ‌ర‌య్యారు. అంత్య‌క్రియ‌ల్లో భాగంగా నాయిని పాడెను మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ మోశారు. మ‌రింత స‌మాచారం కొర‌కు..


రాష్ర్టంలో ఖాళీగా ఉన్న జిల్లా జ‌డ్జి పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. తెలంగాణ స్టేట్ జ్యుడిషీయ‌ల్ స‌ర్వీస్ ఈ పోస్టుల‌ను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భ‌ర్తీ చేయ‌నుంది. మ‌రింత స‌మాచారం కొర‌కు..


సూర్యాపేట జిల్లాలో న‌వంబ‌ర్ 5 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్న‌ట్లు క‌లెక్ట‌ర్ టి. విన‌య్ కృష్ణారెడ్డి తెలిపారు. న‌వంబ‌ర్ మొద‌టివారంలో పీఏసీఎస్, ఐకేపీ కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలును చేప‌ట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. మ‌రింత స‌మాచారం కొర‌కు..


శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన గురువారం బాసర జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారు కాత్యాయని అవతారంలో భక్తులకు  దర్శనమిచ్చారు. మ‌రింత స‌మాచారం కొర‌కు..


కాళేశ్వ‌రం ప్రాజెక్టు ఇంజినీరింగ్ అద్భుతమ‌ని కేంద్ర బృందం ప్ర‌శంసించింది. భారీ వ‌ర్షాల వ‌ల్ల జ‌రిగిన న‌ష్టాన్ని ప‌రిశీలించేందుకు కేంద్ర బృందం రాష్ర్టానికి విచ్చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా పంట న‌ష్టం వాటిల్లిన పొలాల‌ను మ‌ర్కుక్‌లో ప‌రిశీలించిన అనంత‌రం స‌మీపంలోనే ఉన్న కొండ‌పోచ‌మ్మ సాగ‌ర్ పంప్‌హౌజ్‌ను కేంద్ర బృందం సంద‌ర్శించింది. మ‌రింత స‌మాచారం కొర‌కు..


తెలంగాణ మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు నాయిని న‌ర్సింహారెడ్డి అంత్య‌క్రియ‌లు జూబ్లీహిల్స్‌లోని మ‌హాప్ర‌స్థానంలో ముగిశాయి. ప్ర‌భుత్వ అధికారిక లాంఛ‌నాల‌తో నాయిని అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. మ‌రింత స‌మాచారం కొర‌కు..