బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 07, 2020 , 20:00:49

తెలంగాణ రౌండ‌ప్‌..

తెలంగాణ రౌండ‌ప్‌..

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట‌వ్యాప్తంగా శ‌నివారం చోటుచేసుకున్న ప‌లు వార్తావిశేషాల స‌మాహారం. 


ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క నయాపైసా కూడా సాయం అందలేదని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు ఇవాళ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వ వరద సాయంపై ప్రస్తావన వచ్చింది. మ‌రింత స‌మాచారం కొర‌కు..


రాష్ర్టంలోని అంగ‌న్‌వాడీల‌ను మ‌హిళా ర‌క్ష‌ణ కేంద్రాలుగా తీర్చిదిద్ద‌నున్న‌ట్లు రాష్ర్ట గిరిజ‌న‌, మ‌హిళా-శిశు సంక్షేమ‌శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ తెలిపారు. సఖీ కేంద్రాల రాష్ట్ర స్థాయి సమావేశం శ‌నివారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగింది.  మ‌రింత స‌మాచారం కొర‌కు..


రాజ‌ధాని హైద‌రాబాద్‌లో రోజురోజుకు జ‌నాభాతోపాటు ట్రాఫిక్ కూడా పెరుగుతున్న‌ద‌ని‌ ‌హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ అన్నారు. దేశంలో హైద‌రాబాద్ పోలీసుల‌కు మంచిపేరున్న‌ద‌ని చెప్పారు. ర‌హ‌దారి భ‌ద్రత‌‌పై ట్రాఫిక్ పోలీసులు నెక్లెస్‌రోడ్‌లో నిర్వ‌హించిన వ‌ర్చువ‌ల్ ర‌న్‌ను మంత్రి ప్రారంభించారు.  మ‌రింత స‌మాచారం కొర‌కు..


కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో గోదావరి, కృష్ణ పుష్కరాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందని, అయితే ప్రస్తుతం నెలకొని ఉన్న కొవిడ్ ప్రత్యేక పరిస్థితుల కారణంగా తుంగభద్ర పుష్కరాలను నిరాడంబరంగా నిర్వహిస్తున్న‌ట్లు రాష్ర్ట మంత్రులు తెలిపారు. మ‌రింత స‌మాచారం కొర‌కు..


తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలతో ఎప్పటికప్పుడు భేటీ అవుతూనే ఉంటారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అక్కడ ఏం జరుగుతుంది.. ఏదైనా సమస్యలున్నాయా అంటూ వాకబు కూడా చేస్తుంటారు. మరోవైపు ఇండస్ట్రీ నుంచి ఎప్పటికప్పుడు పెద్దలు వచ్చి సిఎంతో భేటీ అవుతుంటారు. మ‌రింత స‌మాచారం కొర‌కు..


రోడ్ల‌పై కుప్ప‌లు, తెప్ప‌లకి‌క చెల్లు అని ఇక‌పై రైతులు చేను, చెల‌క‌ల్లోనే ధాన్యం ప‌నులు చేసుకోవ‌చ్చ‌ని రాష్ర్ట పంచాయ‌తీరాజ్‌శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి దాయ‌క‌ర్‌రావు అన్నారు. మ‌హబూబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలోని చిన్న వంగర గ్రామంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి రైతు కల్లాన్ని మంత్రి శ‌నివారం ప్రారంభించారు. మ‌రింత స‌మాచారం కొర‌కు..


ఓ కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటూ జనగామ డీఈ రవీందర్‌రెడ్డి అవినీతి నిరోధశాఖ అధికారులకు చిక్కాడు. గుత్తేదారు నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మ‌రింత స‌మాచారం కొర‌కు..


ముఖ్యమంత్రి సహాయ నిధికి దక్కన్‌ సిమెంట్స్‌ లిమిటెడ్‌ రూ.25లక్షల విరాళం ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ డైరెక్టర్‌ (వర్క్స్‌) ఎస్‌ వెంకటేశర్లు, కార్పొరేట్‌ సర్వీసెస్‌ మేనేజర్‌ అనిరుధ్‌ చెక్కును శనివారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు అందజేశారు. మ‌రింత స‌మాచారం కొర‌కు..


తెలంగాణ రాష్ర్టంలో అంత‌ర్జాతీయ‌స్థాయిలో సినిమా సిటీ నిర్మించ‌నున్న‌ట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందుకోసం హైద‌రాబాద్ న‌గ‌ర శివారులో 1500 నుంచి 2000 ఎకరాల స్థలాన్ని కేటాయించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. సినీ ప్రముఖులు, అధికారుల బృందం బల్గేరియా వెల్లి అక్కడి సినిమా సిటీని పరిశీలించి రావాలల్సిందిగా సూచించారు. మ‌రింత స‌మాచారం కొర‌కు..


సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ గ్రామంలో కన్నతండ్రే తన ఇద్దరు ఆడపిల్లల కొంతుకోసి హతమార్చేందుకు యత్నించిన ఘటనపై మంత్రి హరీశ్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత చిన్నారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.  మ‌రింత స‌మాచారం కొర‌కు..