ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 20:23:45

తెలంగాణ రౌండప్..

తెలంగాణ రౌండప్..

హైద‌రాబాద్ : రాష్ర్టంలోని ప‌లు ప్రాంతాల్లో శుక్ర‌వారం చోటుచేసుకున్న ప‌లు వార్తా విశేషాల స‌మాహారం.


బతుకమ్మ పండుగ. తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. ఆడబిడ్డల ఆనందాల హరివిల్లు. తొమ్మిది రోజుల వేడుక‌లో భాగంగా మొద‌టిరోజు ఎంగిలిపూల బ‌తుక‌మ్మ రాష్ర్ట వ్యాప్తంగా ఘ‌నంగా ప్రారంభమైంది. 


జీహెచ్ఎంసీ, నాలా చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుల‌కు రాష్ర్ట‌ గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలిపారు. ఈ మేర‌కు గెజిట్ నోటిఫికేష‌న్ విడుదలైంది‌. సీఆర్పీసీ, స్టాంపు చ‌ట్టాల‌కు కేంద్రం అనుమ‌తి త‌ర్వాత గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. 


 జూరాల‌కు ప్రాజెక్టుకు వ‌ర‌ద పోటెత్తింది. ప్రాజెక్టులోకి 5.47 ల‌క్ష‌ల క్యూసెక్యుల నీరు వ‌చ్చి చేరుతుండ‌గా అధికారులు 48 గేట్లు ఎత్తి నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు. 


అడ‌వి పందుల నుంచి పంట‌ను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ‌లు తండ్రీకొడుకుల‌ను బ‌లిగొన్నాయి. మెద‌క్ జిల్లాలోని పెద్ద‌శంక‌రంపేట మండ‌లంలోని ఇస్క‌పాయ‌ల తాండ‌లో ఈ విషాద సంఘ‌ట‌న చోటుచేసుకుంది.  


ఖమ్మం జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాల‌ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప‌రిశీలించారు. 


ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన కోట గోడ కూలింది. దీన్ని రాష్ర్ట ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ ప‌రిశీలించారు. త్వరలోనే కోటకు మరమ్మతులు చేపడుతామని తెలిపారు.


నిరుపేదలకు వరం ముఖ్య మంత్రి సహాయ నిధి అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం బుగ్గారం, పెగడపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంత్రి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 


న‌గ‌రంలోని జూబ్లీహిల్స్ ఓ యువ‌తిపై సామూహిక అత్యాచార ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. పుట్టిన‌రోజు పేరుతో యువ‌తిని ట్రాప్ చేసి కేక్‌లో మ‌త్తుమందు క‌లిపి తినిపించారు. అప‌స్మార‌క‌స్థితిలోకి వెళ్లిన యువ‌తిపై ముగ్గురు స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు.


logo