గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 20:33:28

తెలంగాణ రౌండప్..

తెలంగాణ రౌండప్..

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట‌వ్యాప్తంగా గురువారం నాడు చోటుచేసుకున్న ప‌లు వార్తా విశేషాల స‌మాహారం..


రాష్ర్ట ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు సింగూరు ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు పరిస్థితి, నీటి విడుదలపై అధికారులతో మంత్రి చర్చించారు. సింగూరు జలాశయం నుంచి యాసంగిలో 40 వేల ఎకరాలకు నీళ్లివ్వనున్నట్లు మంత్రి ఈ సంద‌ర్భంగా తెలిపారు. 

 

హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిపై రాక‌పోక‌ల‌ను అధికారులు పున‌రుద్ధ‌రించారు. భారీ వానాల‌తో నిన్న హైవేపై కిలోమీట‌ర్ల మేర వాహ‌నాలు నిలిచిపోయిన సంగ‌తి తెలిసిందే. 


ఏక‌ధాటిగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు స‌ర్వాయి పాప‌న్న గౌడ్ కోట గోడ కుప్ప‌కూలింది. జ‌న‌గామ జిల్లా ర‌ఘునాథప‌ల్లి మండ‌లం ఖిళాషాపూర్‌లో స‌ర్వాయి పాప‌న్న 4 వంద‌ల ఏండ్ల క్రితం నిర్మించిన కోట గోడ కూలడంతో మూడు ఇళ్లు పాక్షికంగా దెబ్బ‌తిన్నాయి.


హైద‌రాబాద్ న‌గ‌ర‌ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో క‌లిసి స‌రూర్‌న‌గ‌ర్‌లోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌ను ప‌రిశీలించారు. స‌హాయ‌క చ‌ర్య‌ల వేగ‌వంతానికి అధికారులను ఆదేశించిన మేయ‌ర్‌ ఒక‌ట్రెండు రోజుల్లో సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటాయ‌ని తెలిపారు. 


కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పరిధిలోని జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ పరిశీలించారు. రైతులు అధైర్య‌ప‌డొద్ద‌ని అండ‌గా ఉండి ఆదుకుంటామ‌ని చెప్పారు. 


మహబూబ్‌న‌గ‌ర్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని రాష్ర్ట‌ ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం కొత్త చెరువులో ఆయ‌న‌ చేప పిల్లలను వదిలారు.


భారీ వ‌ర్షాల‌తో జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఉన్న ఫాక్స్‌సాగ‌ర్ చెరువు 20 ఏండ్ల త‌ర్వాత నిడింది. చెరువులో నీటిమ‌ట్టం 33 అడుగుల‌కు చేరింది. మ‌రో మూడు అడుగులు పెరిగితే క‌ట్ట‌పై నుంచి నీరు ప్ర‌వ‌హించే అవ‌కాశం ఉంది. 


మెదక్ జిల్లాలోని కొల్చరం వద్ద మంజీర వరదలో చిక్కుకున్న ఐదుగురిని అధికారులు క్షేమంగా ర‌క్షించారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బాధితుల‌ను ఒక్కొక్కరిని ఒడ్డుకు చేర్చారు. 


logo