శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 21:04:59

తెలంగాణ రౌండ‌ప్‌..

తెలంగాణ రౌండ‌ప్‌..

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా శ‌నివారం చోటుచేసుకున్న ప‌లు వార్తావిశేషాల స‌మాహారం.


దేశ ప్రప్రథమ ఉప ప్రధాని, హోంశాఖ మంత్రి, ఉక్కు మనిషి సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ జయంత్రి సందర్భంగా రాజ్‌భవన్‌లో జాతీయ ఐక్యతా దినోత్సవం ( ఏక్తా దివస్‌)ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ రాజ్‌సభవన్‌ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. మ‌రింత స‌మాచారం కొర‌కు.. 


ప‌్లాట్లు, అక్ర‌మ లేఅవుట్ల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌కు (ఎల్ఆర్ఎస్‌) ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఎల్ఆర్ఎస్‌ ద‌ర‌ఖాస్తు గ‌డువు నేటితో ముగియ‌నుంది. ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల్లోని అక్ర‌మ‌, అన‌ధికార లేఅవుట్లు, పాట్ల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌ను త‌ప్ప‌నిస‌రిచేస్తూ ఆగ‌స్టు 31న రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. మ‌రింత స‌మాచారం కొర‌కు.. 


దుబ్బాక ఉప ఎన్నిక‌లో భాగంగా రాయ‌పోల్ మండ‌లం ఎల్క‌ల్‌, బేగంపేట గ్రామాల్లో మంత్రి హ‌రీష్ రావు ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ..  స్వ‌ర్గీయ రామ‌లింగారెడ్డి మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. మ‌రింత స‌మాచారం కొర‌కు.. 


నల్లగొండ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. నల్లగొండ మండలం దోమలపల్లి, అప్పాజీపేట గ్రామాల్లో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం రాత్రి గుర్తుతెలియని జంతువు అరుపులు విన్న గ్రామస్తులు అవి చిరుతవేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మ‌రింత స‌మాచారం కొర‌కు.. 


గ్రామీణ రహదారుల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం  ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్‌ జిల్లా ధారూరు మండలంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌తో కలిసి ఆమె శంకుస్థాపన చేసి మాట్లాడారు. మ‌రింత స‌మాచారం కొర‌కు.. 


జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. నవంబర్‌ 7న జీహెచ్‌ఎంసీ ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటన వెలువడనుంది. మ‌రింత స‌మాచారం కొర‌కు.. 


రైతులు పండించిన చివరి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో వానకాలం 2020-21 సంవత్సరానికి సంబంధించి వరి, పత్తి, మక్కల కొనుగోలుపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  మ‌రింత స‌మాచారం కొర‌కు.. 


ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థులు గానీ, వారికి సంబంధించిన వారుగానీ ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘిస్తే పౌరులు సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చ‌ని సిద్దిపేట జిల్లా కలెక్ట‌ర్ భార‌తి హోళ్లికేరి అన్నారు. సిద్ధిపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్‌తో కలిసి క‌లెక్ట‌ర్ మీడియా సమావేశం నిర్వహించారు. మ‌రింత స‌మాచారం కొర‌కు.. 


గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న పలువురు ప్రముఖులను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఓ ఇంట్లో పలువురు పేకాట ఆడుతున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ఇంటిపై దాడి చేసి వివిధ రంగాలకు చెందిన 11 మంది వ్యాపార ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు. మ‌రింత స‌మాచారం కొర‌కు.. 


కుమురం భీం ఆశయ సాధనకు తెలంగాణ‌ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి పేర్కొన్నారు. కుమురం భీం 80వ వర్ధంతి  సందర్భంగా ఆ మహనీయుడిని మంత్రి స్మరించుకున్నారు. మ‌రింత స‌మాచారం కొర‌కు..