గురువారం 02 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 15:34:18

ఆస్ట్రేలియాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

ఆస్ట్రేలియాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. టీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్ బోర్న్  కాన్ బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ నగరాల్లో ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆస్ట్రేలియా ఏసీటీ కన్వీనర్ రవి సాయల మాట్లాడుతూ తెలంగాణను ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్నామన్నారు. అలాగే బంగారు తెలంగాణ సాధనలో తమవంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. కార్యక్రమంలో నాగేందర్ రెడ్డి, రాకేష్ లక్కరసు, వీరేందర్, సాంబరాజు, కిశోర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


logo