గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 22:54:54

తెలంగాణలో కొత్తగా 1,284 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,284 కరోనా కేసులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో శనివారం 1,284 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కేవలం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 667 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 43,780 కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, వైరస్‌ ప్రభావంతో ఇవాళ ఆరుగురు మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 409కి చేరింది. ఇవాళ 1,902 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 30,607 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 12,765 మంది మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. శనివారం 14,883 మందికి కొవిడ్‌-19 పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 2,52,700 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది. 


logo