బుధవారం 03 జూన్ 2020
Telangana - May 05, 2020 , 21:22:48

ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

హైదరాబాద్‌ : సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన రాష్ట్ర  మంత్రివర్గ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. కేబినెట్‌ భేటీ ఏడు గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. కరోనా మహమ్మారి కట్టడి, విద్యార్థులకు పరీక్షల నిర్వహణ, సమగ్ర వ్యవసాయ విధానం, నీటిపారుదల అంశాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, లాక్‌డౌన్‌ పొడిగింపు, మద్యం అమ్మకాలు వంటి తదితర అంశాలపై మంత్రివర్గంలో సమాలోచనలు చేశారు. కాసేపట్లో సీఎం కేసీఆర్ మీడియా ద్వారా మాట్లాడనున్నారు.logo