బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 00:37:18

షిఫ్ట్ పద్ధతిలో ఇంటర్ తరగతులు!

షిఫ్ట్ పద్ధతిలో ఇంటర్ తరగతులు!

హైదరాబాద్ : తెలంతాణలోని జూనియర్ కాలేజీల్లో 2020-21 విద్యా సంవత్సరంలో షిఫ్ట్ విధానంలో తరగతులు నిర్వహించాలని ఇంటర్ బోర్డ్ నిర్ణయిస్తున్నది. అలాగే తరగతుల్లో విద్యార్థుల సంఖ్యను కూడా తగ్గించాలని యోచిస్తున్నది. 

జూనియర్ కళాశాలల్లో తరగతులు నిర్వహించడానికి షిఫ్ట్ వ్యవస్థను ఇంటర్ బోర్డు యోచిస్తున్నది. రెండో సంవత్సరం విద్యార్థులకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మొదటి సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5.30 వరకు జరుపనున్నట్లు తెలిసింది. కొవిడ్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి లోబడి ఉంటాయి. దీనికి అవసరమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాతే విద్యాసంస్థలు తిరిగి తెరుస్తారు. మహమ్మారి కారణంగా దాదాపు రెండు నెలల క్లాస్‌వర్క్ కోల్పోయినందున నష్టాన్ని భర్తీ చేయడానికి సెలవుల సంఖ్యను తగ్గించాలని బోర్డు ప్రతిపాదించింది.

అకాడెమిక్ సెషన్ కోసం జూనియర్ కళాశాలలు తిరిగి తెరిచినప్పుడు.. బోధన-అభ్యాస పద్ధతిలో అంటే ఆఫ్‌లైన్, డిజిటల్ తరగతుల కోసం అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక సబ్జెక్టులో మొత్తం సిలబస్‌లో 30 శాతం డిజిటల్ మోడ్ ద్వారా బోధిస్తారు. వీడియో కంటెంట్ ఇంటర్ బోర్డ యూట్యూబ్ ఛానల్, టీ-సాట్, దూరదర్శన్ యాదగిరి ఛానెల్‌ల ద్వారా అందుబాటులో ఉంచనున్నారు. డిజిటల్ రూపంలో బోధించే సిలబస్ మళ్లీ తరగతి గదుల్లో బోధించరు.

డిజిటల్ తరగతుల విద్యార్థుల అభ్యాస స్థాయిలను అంచనా వేయడానికి, బోర్డు ఒక సబ్జెక్టులో ఇంటర్నల్స్ కోసం 20 మార్కులను ప్రతిపాదించింది. తరువాత ఇది చివరి స్కోర్‌లకు జోడిస్తారు. ఈ అంచనా అసైన్‌మెంట్‌లు, ప్రాజెక్టుల ద్వారా చేయబడుతుంది.

“ప్రతి తరగతిలో విద్యార్థుల సంఖ్యను తగ్గించాలని ప్లాన్ చేసాం. ఉదయం, మధ్యాహ్నం తరగతులు నిర్వహించడానికి షిఫ్ట్ వ్యవస్థ కోసం ప్రణాళికలు కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతి పొందిన తరువాత ఆఫ్‌లైన్, డిజిటల్ తరగతులు విద్యార్థులకు అందుబాటులో వస్తాయి” అని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు అనుబంధాన్ని మంజూరు చేసే ప్రక్రియ జరుగుతున్నదని, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత ప్రవేశాలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.


logo