మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు

హైదరాబాద్ : తెలంగాణలో పదో తగరతి పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రాంచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10వ తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. పది పరీక్షలు ముగిసిన మరుసటి రోజు(మే 26) నుంచి జూన్ 13వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు.
ఆరు సబ్జెక్టులకు ఆరు పరీక్షలే..
గతంలో ఆరు సబ్జెక్టులకు 11 పరీక్షలు నిర్వహించేవారు. కానీ ఈసారి కేవలం ఆరు సబ్జెక్టులకు ఆరు పరీక్షలు నిర్వహించనున్నారు. నాలుగు ఎఫ్ఏ(ఫార్మెటివ్ అసెస్మెంట్) టెస్టులకు గానూ రెండు ఎఫ్ఏ టెస్టులను మాత్రమే నిర్వహించనున్నారు. మొదటి ఎఫ్ఏను మార్చి 15న, రెండో ఎఫ్ఏ టెస్టును ఏప్రిల్ 15న నిర్వహించనున్నారు. సమ్మేటివ్ అసెస్మెంట్ను మే 7 నుంచి 13వ తేదీ మధ్యలో నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
స్కూల్కు తప్పనిసరిగా హాజరు కావాల్సిన అవసరం లేదు
9, 10వ తరగతుల విద్యార్థులు స్కూల్కు తప్పనిసరిగా హాజరు కావాల్సిన అవసరం లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సరిపడా హాజరు శాతం లేనప్పటికీ విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు అనుమతించనున్నారు. జిల్లాల్లో ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు, హైదరాబాద్ జిల్లాలో ఉదయం 8:45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఆన్లైన్ క్లాసులైతే పదో తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య, 9వ తరగతి విద్యార్థులకు సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య నిర్వహించనున్నారు.
తాజావార్తలు
- పొట్టేళ్ల పందెం పోటీలు.. మూడు రాష్ర్టాల నుంచి 22 జీవాలు రాక
- శివుడి సాక్షిగా అభిమానులకు షాక్ ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్
- చదివింది 'పది'.. వ్యాపారం 'కోటి'..
- ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య
- అబద్ధాల బీజేపీ ఆరేండ్లుగా ఏం చేసింది?
- బీజేపీని నువ్వు కొన్నవా..?
- రైల్వే ఉద్యోగం పేరుతో మోసం
- పనిమనిషిపై పాశవికం..
- మల్టీలెవల్ పేరిట మోసాలు
- బీ పాస్ తప్పనిసరి