శనివారం 30 మే 2020
Telangana - May 02, 2020 , 18:04:21

త్వరలోనే కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ : ఎంపీ నామా

త్వరలోనే కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ : ఎంపీ నామా

మధిర : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చర్యలతో కరోనా నుంచి తెలంగాణ రాష్ట్రం అతి త్వరలోనే బయటపడి కరోనా రహిత రాష్ట్రంగా మారుతుందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. శనివారం మధిర పట్టణంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నామ ముత్తయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో మధిర నియోజకవర్గం లోని అన్ని మండలాల్లోని గ్రామాలకు సరిపడా శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ  చేశారు. అదేవిధంగా మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో మధిర మున్సిపాలిటీ లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయకర్, ఎంపీపీ మేడం లత, డిసిసిబి ఉపాధ్యక్షులు దొండపాటి వెంకటేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, మధిర మున్సిపల్ కమిషనర్ దేవేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ, భరత్ విద్యాసంస్థల అధినేత శీలం వెంకట రెడ్డి, వేమిరెడ్డి త్రివేణి, వార్డ్ కౌన్సిలర్ లు, టిఆర్ఎస్ పార్టీ ఐదు మండలాల అధ్యక్ష కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.logo