మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 22, 2020 , 00:42:02

నిశ్శబ్ద యుద్ధం

నిశ్శబ్ద యుద్ధం

  • చిత్త శుద్ధి ఇదిగో..

గ్రామంలో సర్పంచ్‌ గారు.. కరోనాపై చాటింపు వేయిస్తారు.. పట్టణంలో కార్మికుడు రోడ్డుపై మందును పిచికారి చేస్తుంటాడు.. నగరంలో ట్రాఫిక్‌ పోలీస్‌ వాహనాలను నియంత్రిస్తూనే రెడ్‌లైట్‌ పడ్డవైపు కరోనా జాగ్రత్తల పోస్టర్‌ చూపిస్తుంటాడు.. కాస్త దూరంలో ఆశావర్కర్లు కాలనీకి వెళ్లి విదేశాలనుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తుంటారు.. ఇంకొంత దూరంలో పోలీసులు  ఇంటింటికీ వెళ్లి కరోనాపై అవగాహన కల్పిస్తుంటారు.. ఆస్పత్రిలో వైద్యులు అనుమానితులను అనుక్షణం కాపాడుకుంటారు.. కరీంనగర్‌లో మంత్రిగారు ఆందోళనతో ఉన్న ప్రజలవద్దకు వెళ్లి భరోసా ఇస్తుంటారు.. ఆరోగ్య మంత్రిగారు హైదరాబాద్‌ సమీక్షలు నిర్వహిస్తారు.. ముఖ్యమంత్రిగారు ఇటు ప్రభుత్వ విభాగాలతో.. అటు కేంద్రంతో సమన్వయం నెరపుతూనే ప్రజల కోసం తానున్నానని విలేకరుల సమావేశంలో భరోసా ఇస్తుంటారు. ఆగమాగం లేదు.. హడావిడి లేదు... 

ఇదొక నిశ్శబ్ద యుద్ధం.. ఎవరూ చెప్పకున్నా, ఎవరూ చూడకున్నా.. ఎవరికి వాళ్లు, ఎవరి పని వాళ్లు చేసుకుపోతూనే ఉన్నారు. ప్రజల ప్రాణాల కోసం తమ ప్రాణాలను లెక్కచేయకుండా...


రైలు శుభ్రం

సికింద్రాబాద్‌  రైల్వేస్టేషన్‌లో బోగీలను శుభ్రం చేస్తున్న సిబ్బంది

బస్సు పరిశుభ్రం

సికింద్రాబాద్‌ పరిధిలోని కంటోన్మెంట్‌ బస్సును శానిటైజర్‌తో శుభ్రం చేస్తున్న ఆర్టీసీ సిబ్బంది


logo
>>>>>>