సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 16:11:39

రైతు వేదికల నిర్మాణాలు..నవ శకానికి పునాది రాళ్లు

రైతు వేదికల నిర్మాణాలు..నవ శకానికి పునాది రాళ్లు

నాగర్ కర్నూల్ : ఇన్నేండు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆరేండ్లలోనే వ్యవసాయ రంగాన్ని సీఎం కేసీఆర్ నవ కల్పనలతో దేశానికే ఆదర్శంగా మార్చారన్నారు. అచ్చంపేట నియోజకవర్గం దేవదారికుంట తండాలో, అచ్చంపేటలో నూతన వ్యవసాయ గోడౌన్లు  మంత్రి ప్రారంభించారు. అలాగే కొరటికల్, రంగాపూర్, పల్కపల్లి, కొండనాగుల, తిమ్మాయిపల్లి, డిండి చింతపల్లి గ్రామాల్లో  రైతువేదికల నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. తెలంగాణ సాగుకు యోగ్యమైన రాష్ట్రమని అన్ని రకాల పంటలకు అనువైనదని పేర్కొన్నారు.

దేశంలో ఎక్కడ ఏ పంట పండించినా అది ఈ దేశం ఆకలి తీర్చేందుకే అన్న విషయాన్ని కేంద్రం విస్మరించడం బాధాకరమన్నారు. కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కేంద్రం నిర్లక్ష్యాన్ని గుర్తించే సీఎం కేసీఆర్ సొంతంగా నిర్ణయాలు తీసుకుని ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టారని తెలిపారు.

రైతులను సంఘటితం చేసేందుకే రైతువేదికల నిర్మాణం జరుగుతున్నాయని వెల్లడించారు. రైతువేదికలు దేశానికి దిక్సూచీలుగా నిలిచి నూతన విప్లవానికి నాంది పలుకుతాయన్నారు. నియంత్రిత వ్యవసాయంతోనే రైతులకు అధిక లాభాలు వస్తాయన్నారు. వ్యవసాయ అనుకూల విధానాలతో రాష్ట్రంలో సాగు పెరిగిందని మంత్రి వెల్లడించారు.

రాష్ట్రంలో ఎరువుల వాడకం తగ్గించేందుకు పచ్చిరొట్ట, పిల్లిపెసర, పెసర, జీలుగు విత్తనాలను రైతులకు అందిస్తున్నామని తెలిపారు. కరోనా గురించి భయపడొద్దని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల ఉద్యోగులకు సిద్ధం చేసిన 5 వేల నిత్యావసరాల కిట్లను పంపిణీ చేసిన మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి , కలెక్టర్ శర్మన్ , అదనపు కలెక్టర్ హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు. 


logo