మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 03:40:06

మెరుగైన క్రీడాపాలసీ

మెరుగైన క్రీడాపాలసీ

  • తెలంగాణను క్రీడల్లో దేశంలో నంబర్వన్గా నిలుపాలి
  • సబ్ కమిటీ  సమావేశంలో మంత్రి కే తారకరామారావు

హైదరాబాద్,నమస్తే తెలంగాణ: రాష్ట్ర క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా తీర్చిదిద్దే విధంగా తెలంగాణలో ఉత్తమ క్రీడాపాలసీని అమలుచేయనున్నట్టు పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనికోసం ప్రపంచంలో ఉత్తమ పాలసీలను అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలుచేయాలని సూచించారు. శుక్రవారం రవీంద్రభారతిలో క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి వీ శ్రీనివాస్ అధ్యక్షతన క్రీడాపాలసీపై క్యాబినెట్ సబ్ తొలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న క్రీడల మౌళిక సదుపాయా లు, అకాడమీలు, స్పోర్ట్స్ స్కూల్స్, మైదానాల పరిస్థితి, కోచ్ క్రీడాకారుల వివరాలను మంత్రులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు.. క్రీడాశాఖ అధికారులకు స్పోర్ట్స్ పాలసీ రూపకల్పనపై దిశానిర్దేశం చేశారు. క్రీడారంగంలో రాష్ర్టాన్ని నంబర్ తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నడుంబిగించిందని పేర్కొన్నారు. 

ఈ సారి కోచ్ క్రీడాకారులతో..

అంతర్జాతీయ టోర్నీల్లో పతకాలు సాధించడమే లక్ష్యంగా.. క్రీడాకారులకు సదుపాయాలు కల్పించేలా క్రీడాపాలసీ ఉండాలని క్యాబి నెట్ సబ్ కమిటీకి కేటీఆర్ సూచించారు. క్రీడా, విద్యా, పురపాలక, గ్రామీణాభివృద్ధి శాఖల ప్రభుత్వ కార్యదర్శులతో త్వరలోనే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి క్రీడాకారులకు అందుతున్న సౌకర్యాలపై సమగ్ర వివరాలను క్యాబినెట్ సబ్ అందించాలని మం త్రు లు ఆదేశించారు. తదుపరి సమావేశానికి ప్రముఖ క్రీడాకారులు, కోచ్ ఆహ్వానించి వారి అభిప్రాయాలను స్వీకరించాలని ఆదేశించారు. సమావేశంలో సాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ క్రీడాశాఖ కార్యదర్శి రఘునందన్ సంయుక్త కార్యదర్శి రమేశ్, క్రీడాశాఖ ఉన్నతాధికారులు సుజాత, నర్సయ్య, విమలాకర్ మనోహర్, ధనలక్ష్మి, చంద్రావతి, దీపక్ పాల్గొన్నారు.


logo