మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 04, 2020 , 01:32:09

గల్ఫ్‌లో గొర్రెల కాపరి మృతి

గల్ఫ్‌లో గొర్రెల కాపరి మృతి
  • మంత్రి కేటీఆర్‌ చొరవతో సొంతూరుకు భౌతికకాయం

ముస్తాబాద్‌: కుటుంబపోషణ కోసం ఎడారి దేశం వెళ్లి అక్కడే గుండెపోటుతో మృతిచెందిన దేవయ్య మృతదేహం మంత్రి కేటీఆర్‌ చొరవతో మంగళవారం స్వగ్రామానికి చేరింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలంలోని గూడెం గ్రామానికి చెందిన తాడెపు దేవయ్య సౌదీ అరేబియాలో గొర్రెలకాపరిగా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 11న గొర్రెలు కాస్తూనే గుండెపోటుతో మృతి చెందగా, సహ ఉద్యోగులు సమాచారం ఇచ్చారు. 


దేవయ్య బంధువైన స్థానిక ప్రజాప్రతినిధి చిప్పలపల్లి సర్పంచి తాడెపు జ్యోతి యెల్లం మంత్రి కేటీఆర్‌కు విషయం తెలిపి సహకరించాలని కోరారు. స్పందించిన మంత్రి అక్కడి రాయబార కార్యాలయం సిబ్బందితో మాట్లాడగా, సోమవారం అర్ధరాత్రి మృతదేహం స్వగ్రామానికి చేరుకున్నది. దేవయ్య భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు సహకరించిన నాయకులు జనగామ శరత్‌రావు, తాడెపు యెల్లం, సురేందర్‌రావు, అంజన్‌రావు, కొమ్ము బాలయ్య, శ్రీనివాస్‌రావు ఇతర నాయకులకు బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. 


logo
>>>>>>