శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 11:51:50

జీవో నం. 46 ఉల్లంఘ‌న‌.. స్కూళ్ల‌పై విచార‌ణ‌

జీవో నం. 46 ఉల్లంఘ‌న‌.. స్కూళ్ల‌పై విచార‌ణ‌

హైద‌రాబాద్ : కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న క్ర‌మంలో తెలంగాణ‌లోని ప్ర‌యివేటు పాఠ‌శాల‌లు ఫీజులు పెంచొద్ద‌ని ప్ర‌భుత్వం జీవో నం. 46ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. కానీ కొన్ని ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల యాజ‌మాన్యాలు ఈ జీవో నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించాయి. జీవో నం. 46 నిబంధ‌న‌లు ఉల్లంఘించిన స్కూళ్ల‌పై విచార‌ణ జ‌రిపేందుకు తెలంగాణ పాఠ‌శాల విద్యాశాఖ నిర్ణ‌యం తీసుకుంది. ఫిర్యాదులు వ‌చ్చిన పాఠ‌శాల‌ల‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. పాఠ‌శాల విద్యాశాఖ‌లోని న‌లుగురు జాయింట్ డైరెక్ట‌ర్‌లుగా విచార‌ణ అధికారులుగా కొన‌సాగ‌నున్నారు. ట్యూష‌న్ ఫీజు నెల‌వారీగా మాత్ర‌మే తీసుకోవాల‌ని జీవో నం. 46లో పొందుప‌రిచారు. మౌంట్ లిటేరా జీ, మెరీడియ‌న్, గీతాంజ‌లి ప‌బ్లిక్ స్కూల్‌, లిటిల్ ఫ్ల‌వ‌ర్స్, నారాయ‌ణ హైస్కూల్‌(డీడీ కాల‌నీ), క‌ల్ప స్కూల్ (సికింద్రాబాద్), సెయింట్ ఆండ్రూస్ (మేడ్చ‌ల్‌), నీర‌జ్ ప‌బ్లిక్ స్కూల్‌(అమీర్‌పేట‌), ఆక్స్‌ఫ‌ర్డ్ గ్రామ‌ర్ స్కూల్‌(హిమాయ‌త్ న‌గ‌ర్‌)పై విచార‌ణ జ‌ర‌ప‌నున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు ఫీజులు పెంచవద్దని ప్రభుత్వం జీవో నెం.46ను ఈ ఏడాది ఏప్రిల్ నెల‌లో విడుదల చేసింది. నెలవారి ట్యూషన్‌ ఫీజు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. జీవో 46ను ఉల్లంఘిస్తే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సహా అన్ని పాఠశాలలకు, ప్రైవేటు బడులకు జీవో వర్తిస్తుందని పేర్కొంది.