గురువారం 04 జూన్ 2020
Telangana - Feb 24, 2020 , 01:53:29

తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం

తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
  • ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మాడ్గుల: తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసేందుకు వచ్చిన వివిధ రాష్ర్టాల నుంచి అధికారుల బృందాలు తమ రాష్ర్టాల్లో అమలుచేస్తున్నా..ప్రతిపక్ష నా యకులకు కనబడట్లేదని విమర్శించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా మాడ్డులలో మాడ్గుల, ఆమనగల్లు, కడ్తాల మండలాలకు చెందిన 638 మంది గీత కార్మికులకు మంజూరైన లైసెన్స్‌లను ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, నాగర్‌కర్నూల్‌ జెడ్పీ వైస్‌చైర్మన్‌ బాలాజీసింగ్‌తో కలిసి మంత్రి అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కుల వృత్తులకు పూర్వవైభవం తెచ్చేందుకు సీఎం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నట్టు చెప్పారు. తాటికల్లుకు క్యాన్సర్‌ నిరోధకశక్తి ఉందని వైద్యులు చెబుతున్న తరుణంలో గీత కార్మికులు కల్తీ లేని కల్లును విక్రయించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని మంత్రి కోరారు. 


logo