ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 11, 2020 , 20:51:26

రాష్ర్ట ఇంటర్మీడియ‌ట్ టాప‌ర్‌కు రూ. ల‌క్ష ఆర్థికసాయం

రాష్ర్ట ఇంటర్మీడియ‌ట్ టాప‌ర్‌కు రూ. ల‌క్ష ఆర్థికసాయం

కొమురంభీం ఆసిఫాబాద్ : తెలంగాణ రాష్ర్ట ఇంట‌ర్మీడియ‌ట్ ద్వితీయ సంవ‌త్స‌ర టాప‌ర్ కాటి క‌ల్యాణీకి సిర్పూర్(టీ) ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప మంగ‌ళ‌వారం కాగ‌జ్‌న‌గ‌ర్‌లో రూ. ల‌క్ష చెక్కును అంద‌జేశారు. స్వ‌చ్ఛంద సంస్థ‌ య‌శోద ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఈ ప్రోత్స‌హాకాన్ని అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే కోన‌ప్ప మాట్లాడుతూ... తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల్లో టాప‌ర్‌గా నిలిచి క‌ల్యాణీ సిర్పూర్‌(టీ) నియోజ‌క‌వ‌ర్గంలో గుర్తింపును తెచ్చుకుంద‌న్నారు. క‌ల్యాణి ఉన్న‌త చ‌దువుల విష‌యంలో తాను అన్ని ర‌కాలుగా సాయం చేయ‌నున్న‌ట్లు చెప్పారు. విద్యార్థులు ఈమెను స్ఫూర్తిగా తీసుకోవాల‌న్నారు. వీధి వ్యాపారి కూతురైన క‌ల్యాణి ఇంట‌ర్ ప‌రీక్ష‌లో 1000 మార్కుల‌కు గాను 992 మార్కులు సాధించింది. మేథా ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ స్పాన్స‌ర్‌షిప్ స‌హాయంతో ఆమె విద్య‌న‌భ్య‌సిస్తోంది. ప‌దో త‌ర‌గ‌తి సైతం జెడ్పీహెచ్‌లో చ‌దివి 9.7 జీపీఏను సాధించింది.


logo