గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 03:12:35

కార్గో చార్జీలు తగ్గించిన టీఎస్‌ఆర్టీసీ

కార్గో చార్జీలు తగ్గించిన టీఎస్‌ఆర్టీసీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఇటీవలే పీసీసీ ( పార్సిల్‌-కొరియర్‌-కార్గో) సేవలను ప్రారంభించిన టీఎస్‌ఆర్టీసీ వినియోగదారుల సౌకర్యార్థం పలు చార్జీలను తగ్గించినట్టు ప్రకటించింది. తగ్గించిన చార్జీలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయని తెలిపింది. ఇప్పటి వరకు 0-10 కిలోల వరకు ఉన్న స్లాబును 0-5 కిలోలకు కుదించింది. 6-10 కిలోలకు మరో స్లాబును ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 0 నుంచి 10 కిలోల బరువు ఉన్న పార్సిల్‌ను 75 కిలోమీటర్లు తరలించేందుకు రూ. 50 వసూలు చేసేవారు. ప్రస్తుతం ఐదు కిలోల లోపు పార్సిల్‌ను 75 కిలోమీటర్లు తరలించేందుకు రూ. 20 మాత్రమే వసూలుచేస్తారు. 6 నుంచి 10 కిలోల బరువు ఉన్న పార్సిల్స్‌కు రూ. 50 వసూలు చేస్తున్నారు. అంతర్రాష్ట్ర రవాణా చార్జీలను సైతం తగ్గించింది. గతంలో 250 గ్రాముల పార్సిల్‌ను తరలించేందుకు రూ. 75 వసూలు చేయగా ప్రస్తుతం రూ. 40కి తగ్గించారుlogo