రాజ్‌పథ్‌లో మిత్ర కవాతు

- ఢిల్లీ పరేడ్‌లో తెలంగాణ రోబో
హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో తెలంగాణ మేధస్సు మెరిసింది. వోకల్ ఫర్ లోకల్ నినాదంతో ప్రదర్శించిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌లో ఆవిష్కరించిన ‘మిత్ర’ రోబో ఢిల్లీ వేదికగా దేశీయ ఆవిష్కరణలకు అద్దం పట్టింది. తెలంగాణ శకటంలో బ్రహ్మోస్ క్షిపణులు, ఆల్ ఇండియా రేడియో శాటిలైట్లు, ఎలక్ట్రిక్ కారు నమూనాలతో పాటు ముందు భాగంలో ఏర్పాటుచేసిన మిత్ర రోబోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
టీహబ్‌లో ప్రాణం
వరంగల్‌లోని గోపాల్‌పూర్‌కు చెందిన దండు భరత్‌కుమార్ తన సహచరులు బాలాజీ విశ్వనాథన్, మహాలక్ష్మితో కలిసి టీ-హబ్‌లో ఈ రోబోను ఆవిష్కరించారు. అనంతరం బెంగళూరు కేంద్రంగా ఇన్వెంటో రోబోటిక్స్ కంపెనీని ప్రారంభించారు. మిత్ర రోబో పనితీరు గురించి తెలుసుకున్న పలు దేశాలు వాటికోసం ఆర్డర్లు పంపుతున్నాయి. ఇప్పటివరకు 50కి పైగా మిత్ర రోబోలు వివిధ దేశాల్లో వివిధ రంగాల్లో సేవలందిస్తున్నాయి. బ్రిటన్, అమెరికా, చైనా, ఆస్ట్రేలియా, దుబాయ్, ఖతార్ తదితర దేశాలకు వీటిని ఎగుమతి చేస్తున్నారు. హాస్పిటాలిటీ రంగంలో సేవలందించేందుకు మిత్ర రోబోను రూపొందించినప్పటికీ, కొవిడ్ కారణంగా వైద్య రంగంలోనూ సేవలందించేలా తీర్చిదిద్దారు.
‘మిత్ర’ ఏం చేస్తుంది
కార్యాలయాలు, దవాఖానలు, సంస్థలు.. ఇలా ఎక్కడైనా ఫ్రంట్‌లైన్ కార్యాలయంలో సిబ్బంది అందించే సేవలను మిత్ర అందిస్తుంది. పలుకరిస్తుంది.. ప్రశ్నిస్తుంది.. సమాధానాలు ఇస్తుంది.. సూచనలు చేస్తుంది. కొవిడ్ సమయంలో దవాఖానలకు అనుగుణంగా రూపొందించిన మిత్ర.. శరీర ఉష్ణోగ్రతను పరిశీలించి.. జ్వరం, జలుబు, దగ్గు.. వంటి లక్షణాల గురించి ఆరా తీసి నమోదు చేసింది.
గర్వంగా ఉంది
ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో మిత్ర కు చోటు దక్కడం గర్వంగా ఉంది. ప్రపంచం మొత్తం చూసింది. గతేడాది తొలిసారి చోటు దక్కగా ఇది రెండోసారి. తెలంగాణ బిడ్డగా ఎంతో గర్విస్తున్నా. టీ-హబ్ ఎంతో తోడ్పాటునందించింది. ఆఫీస్ కూ డా లేని సమయంలో అండగా నిలిచింది.
- భరత్ కుమార్,
సీటీవో, ఇన్వెంటో రోబోటిక్స్
తాజావార్తలు
- కుక్క పిల్లను దత్తత తీసుకున్న సోనూసూద్ తనయుడు
- వృద్ధురాలి హత్య : కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి..!
- వైష్ణవ్ తేజ్ లేకపోతే నా 'ఉప్పెన' ఒంటరి అయ్యుండేది
- గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!
- ఐపీఎల్లో క్రికెట్‌కు విలువ లేదు.. పాకిస్థాన్ లీగే బెటర్!
- ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 10 మంది హైదరాబాదీలు
- ఎంపీ నంద్‌కుమార్ సింగ్ చౌహాన్ మృతికి రాష్ట్రపతి సంతాపం
- ఇన్‌స్టాలో జాన్ అబ్రహం షర్ట్‌లెస్ పిక్ వైరల్!
- పవన్ ఫుల్‌బిజీ..ఒకే రోజు రెండు సినిమాలు
- కంట్లో నీళ్లు రాకుండా ఉల్లిపాయలు కోయడమెలా