శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 00:14:09

నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తాం : ట్రెసా

నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తాం : ట్రెసా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రజలకు మెరుగైన, సత్వర సేవ లు అందించేందుకు తీసుకువస్తున్న నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌(ట్రెసా) ప్రకటించింది. సీఎం కేసీఆర్‌పై తమకు సంపూర్ణ విశ్వా సం ఉన్నదని తెలిపింది. ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి అధ్యక్షతన 33 జిల్లాల సీసీఎల్‌ఏ యూనిట్‌ అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్రకార్యవర్గ సభ్యులు శనివారం రెవెన్యూభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ట్రెసా ప్రధాన కార్యదర్శి కే గౌతమ్‌కుమార్‌, అసోసియేట్‌ అధ్యక్షులు మన్నె ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo