గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 02:59:44

బీడాలో విద్యార్థి విభాగం

బీడాలో విద్యార్థి విభాగం

  • స్థాపించిన తెలంగాణవాసి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: యూకేలో ప్రతిష్ఠాత్మకమైన బ్రిటిష్‌ ఇంటర్నేషనల్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (బీడా)కు అనుసంధానంగా ఓ తెలంగాణవాసి విద్యార్థి విభాగాన్ని ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌కు చెందిన సాయిరాం పిల్లరిశెట్టి నాలుగేండ్ల క్రితం ఎంబీబీఎస్‌ చదువడానికి యూకే వెళ్లారు. విద్యార్థిదశలోనే బీడాతో కలిసి పనిచేస్తూ.. 2018లో నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. యూకేలో ఉంటున్న ఇతర దేశాల వైద్యుల కోసం బీడా పనిచేస్తున్నట్టే.. ఎంబీబీఎస్‌ అభ్యసించడానికి వచ్చే విద్యార్థుల కోసం ఓ వేదిక ఉండాలనే తన ఆలోచనను సాయిరాం బీడా ముందుంచారు. 

దానికి బీడా ఆమోదముద్ర వేయడంతో విద్యార్థి విభాగం ఏర్పాటైంది. యూకేలో ఎంబీబీఎస్‌ చదువడానికి వచ్చే విద్యార్థులకు అవసరమైన సాయం అందించడం, మార్గనిర్దేశంచేయడం దీని ముఖ్య ఉద్దేమని సాయిరాం చెప్పారు. యూకేలో విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే సెప్టెంబరు నుంచి తమ కార్యకలాపాలు మొదలు పెడుతామని పేర్కొన్నారు. విదేశీ విద్యార్థుల కోసం వర్క్‌షాప్‌లు, పరీక్షలు మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఉన్నత చదువులు పూర్తిచేసుకొని తిరిగి హైదరాబాద్‌కు వచ్చి సేవ చేయాలన్నదే తన ఆశయమని సాయిరాం వెల్లడించారు.


logo