గురువారం 26 నవంబర్ 2020
Telangana - Aug 09, 2020 , 01:50:50

రికవరీ రేటు 70%

రికవరీ రేటు 70%

  • 54 వేల మందికిపైగా కోలుకున్నారు
  • 6 లక్షలకు చేరిన పరీక్షలు..శుక్రవారం 2,256 మందికి కరోనా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 70% గా నమోదైంది. శుక్రవారం 1,091 మంది వైరస్‌నుంచి కోలుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 54,330కి చేరుకున్నది. మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షల ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. శుక్రవారం 23,322 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్టుల సంఖ్య 5,90,306కు చేరుకున్నట్టు శనివారం విడుదలచేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. ఒక్కరోజే 2,256 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. జీహెచ్‌ఎంసీలోనే 464 కేసులు నమోదయ్యా యి. రంగారెడ్డి జిల్లాల్లో 181, వరంగల్‌ అర్బన్‌లో 187, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 138, కరీంనగర్‌లో 101, జోగుళాంబ గద్వాలలో 95, సంగారెడ్డిలో 92, పెద్దపల్లిలో 84, భద్రాద్రి కొత్తగూడెంలో 79, రాజన్న సిరిసిల్లలో 78, కామారెడ్డిలో 76, నిజామాబాద్‌లో 74, ఖమ్మంలో 69, సిద్దిపేటలో 63, నల్లగొండలో 61, జగిత్యాలలో 49, మహబూబ్‌నగర్‌లో 45, మంచిర్యాలలో 44, జయశంకర్‌ భూపాలపల్లిలో 38, ఆదిలాబాద్‌లో 26, సూర్యాపేటలో 25, యాదాద్రి భువనగిరిలో 24, మహబూబాబాద్‌లో 23, ములుగులో 20, వనపర్తిలో 19, జనగామ, నిర్మల్‌లలో 18 చొప్పున, వరంగల్‌ రూరల్‌లో 16, మెదక్‌లో 14, నాగర్‌కర్నూల్‌, వికారాబాద్‌లలో 13 చొప్పున, నారాయణపేటలో 9 కేసులు వెలుగుచూశాయి.  

ఆరోగ్యంగానే ఉన్నా: మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌/హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తాను ఆరోగ్యంగా ఉన్నానని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రకటించారు. ఇటీవల కరోనా బారిన పడిన తాను ఐదు రోజుల్లోనే కోలుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ వీడియోను విడుదలచేశారు. ‘గత ఆదివారం నాకు కరోనా పాజిటివ్‌గా తేలిం ది. వెంటనే నా భార్యకు టెస్ట్‌చేయిస్తే ఆమెకు కూడా వైర స్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. మా సొంత దవాఖానలో చికిత్స పొందాం. 5 రోజుల్లో కోలుకొని ఇప్పుడు ఐసొలేషన్‌లో ఉన్నాం’.  

ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి కరోనా  

ఎల్బీనగర్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఎమ్మెల్యేతోపాటు ఆయన సతీమణి కమల, ఇద్దరు కుమారులకూ వైరస్‌ సోకి ంది. ప్రస్తుతం వీరంతా హోంక్వారంటైన్‌లో ఉన్నా రు. కోలుకున్న తర్వాత ప్లా స్మా దానం చేస్తామన్నారు.

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు      
శుక్రవారం
మొత్తం 
పాజిటివ్‌కేసులు  
2,256
77,513 
డిశ్చార్జి అయినవారు     
1,091
54,330
మరణాలు
14   
615
చికిత్స పొందుతున్నవారు    
 -
22,568