గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 03:29:53

85 వేలు దాటిన డిశ్చార్జిలు

85 వేలు దాటిన డిశ్చార్జిలు

  • మంగళవారం 61 వేల పరీక్షలు
  • తాజాగా 3,018 మందికి కరోనా
  • మరణాల రేటు 0.69 శాతమే

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన పకడ్బందీ చర్యలు, మైరుగైన వైద్యసేవల కారణంగా కరోనా బాధితులు వేగంగా కోలుకుంటున్నారు. ఇప్పటివరకు మొత్తం 1,11,688 కేసులు నమోదుకాగా, 85,223 (76.3%) మంది వైరస్‌ నుంచి కోలుకొని క్షేమంగా ఇండ్లకు వెళ్లారు. మరోవైపు మంగళవారం రికార్డుస్థాయిలో 61వేలకుపైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 10.82 లక్షలకు చేరింది. తాజాగా 3,018 మందికి పాజిటివ్‌గా తేలిందని బుధవారం విడుదలచేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 475 కేసులు వెలుగుచూశాయి. రంగారెడ్డి జిల్లాలో 247, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 204, నల్లగొండలో 190, ఖమ్మంలో 161, వరంగల్‌ అర్బన్‌లో 139, నిజామాబాద్‌లో 136, కరీంనగర్‌లో 127, మంచిర్యాలలో 103, జగిత్యాలలో 100, భద్రాద్రి కొత్తగూడెంలో 95 కేసులు రికార్డయ్యాయి. వైరస్‌తోపాటు ఇతర అనారోగ్య కారణాల వల్ల 10 మంది మృతిచెందారు. మొత్తం మృతుల సంఖ్య 780కి పెరిగింది. ఇది మొత్తం కేసుల్లో 0.69 శాతం మాత్రమేనని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు
మంగళవారం
మొత్తం
పాజిటివ్‌ కేసులు
30181,11,688
డిశ్చార్జి
1,06085,223
మరణాలు
10
780
చికిత్సలో  ఉన్నది
-25,685
logo