గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Aug 30, 2020 , 02:05:48

89 వేల మంది కోలుకున్నారు

89 వేల మంది కోలుకున్నారు

  • శుక్రవారం 62 వేల టెస్టులు, 2,751 మందికి పాజిటివ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా సోకి కోలుకుంటున్నవారి సంఖ్య రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటివరకు 1,20,166 మంది వైరస్‌ బారిన పడగా, ఇందులో 89,350 మంది కోలుకున్నారు. మరో 30 వేల మంది హోం ఐసొలేషన్‌లో, దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షల ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. శుక్రవారం 62 వేల టెస్టులుచేయగా, మొత్తం పరీక్షల సంఖ్య 12.66 లక్షలకు చేరినట్టు శనివారం విడుదలచేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. రాష్ట్రంలో ఒక్కరోజే 2,751 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. జీహెచ్‌ఎంసీలోనే 432 కేసులు రికార్డయ్యా యి. కరీంనగర్‌ జిల్లాలో 192, రంగారెడ్డిలో 185, నల్లగొండలో 147, ఖమ్మంలో 132 కేసులు నమోదయ్యాయి. కరోనా కు తోడు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా 9 మంది మరణించారు. దేశవ్యాప్తంగా మరణాల రేటు 1.81% ఉంటే, తెలంగాణలో 0.67 శాతంగా ఉన్నది.

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు
శుక్రవారం
మొత్తం
పాజిటివ్‌ కేసులు
2,751
1,20,166
డిశ్చార్జి
1,675
89,350
మరణాలు
09
808
చికిత్సలో  ఉన్నది-
30,008
logo