బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 08, 2020 , 02:25:34

రోజువారీ టెస్టులు 15 వేలు

రోజువారీ టెస్టులు 15 వేలు

  • గురువారం 2,207 మంది కరోనా పాజిటివ్‌
  • 12 మంది మృతి, 1,136 మంది డిశ్చార్జి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం ప్రతి 10 లక్షల మందిలో 140 పరీక్షలుచేయాలి. రాష్ట్ర జనాభాకు అనుగుణంగా 5,600 పరీక్షలుచేయాల్సి ఉంటుంది. అయితే తెలంగాణలో మాత్రం అంతకు మూడు రెట్ల పరీక్షలు జరుగుతున్నాయి. ప్రతిరోజుకు సగటున 15,271 టెస్టులు నిర్వహిస్తున్నారు. గురువారం 23,495 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఇప్పటివరకు మొత్తం టెస్టుల సంఖ్య 5,66,984కు చేరుకున్నట్టు శుక్రవారం విడుదలచేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. రాష్ట్రంలో ఒక్కరోజే 2,207 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 532 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 196, వరంగల్‌ అర్బన్‌లో 142, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 136, కామారెడ్డిలో 96, కరీంనగర్‌లో 93, నిజామాబాద్‌లో 89, జోగుళాంబ గద్వాలలో 87, ఖమ్మంలో 85, భద్రాద్రి కొత్తగూడెంలో 82, పెద్దపల్లిలో 71, జనగామలో 60, మహబూబ్‌నగర్‌లో 51, సంగారెడ్డిలో 37, నాగర్‌కర్నూల్‌, జగిత్యాలల్లో 36 చొప్పున, మంచిర్యాలలో 35, మెదక్‌లో 32, జయశంకర్‌ భూపాలపల్లిలో 29, సిద్దిపేట, నల్లగొండలలో 28 చొప్పున, సిరిసిల్లలో 25, వికారాబాద్‌లో 24, యాదాద్రి, సూర్యాపేటల్లో 23 చొప్పున, ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌లలో 21 చొప్పున, ములుగులో 20, వనపర్తిలో 18, వరంగల్‌ రూరల్‌లో 16, నారాయణపేటలో 15, ఆదిలాబాద్‌లో 14, నిర్మల్‌లో 6 కేసులు వెలుగుచూశాయి. కరోనాకు తోడు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా 12 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా కేసుల రికవరీ రేటు 70.7 శాతంగా ఉన్నది.

డిప్యూటీ డీఎంహెచ్‌వో నరేశ్‌ మృతి

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ నరేశ్‌కుమార్‌ (35) శుక్రవారం మరణించారు. వారం క్రితం కరోనా రావడంతో గాంధీ దవాఖానలో ప్రత్యేక వైద్య చికిత్స అందించారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో రెండు రోజుల క్రితం యశోద దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. నరేశ్‌కుమార్‌ మృతిపై వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.ఆయన కు టుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు.  

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు       
గురువారం
మొత్తం 
పాజిటివ్‌కేసులు
2,207
75,257 
డిశ్చార్జి అయినవారు    
1,136
53,239
మరణా
12   
601
చికిత్స పొందుతున్నవారు    
-
21,417 

logo