శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 04, 2020 , 03:03:36

85% దాటిన రికవరీ రేటు

85% దాటిన రికవరీ రేటు

  • శుక్రవారం 1,718 మందికి కరోనా పాజిటివ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా బారినపడి కోలుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. దేశంలో రికవరీ రేటు 83.08% ఉండగా, తెలంగాణలో 85.05 శాతానికి చేరుకున్నది. శుక్రవారంవరకు 31.53 లక్షల కరోనా పరీక్షలు పూర్తిచేయగా, 1.97 లక్షల మందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో 1.67 లక్షల మంది కోలుకోగా, 28,328 మంది ఇండ్లు, దవాఖానల్లో చికిత్సపొందుతున్నట్టు శనివారం వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. శుక్రవారం కొత్తగా 1,718 మందికి పాజిటివ్‌ వచ్చింది. జీహెచ్‌ఎంసీలో 285, రంగారెడ్డిలో 129, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 115, కరీంనగర్‌లో 105, నల్లగొండలో 103 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు
శుక్రవారం
మొత్తం
పాజిటివ్‌ కేసులు
1,718
1,97,327
డిశ్చార్జి అయినవారు
2,002
1,67,846
మరణాలు
08
1,153
చికిత్స పొందుతున్నవారు
-
28,328
logo